'జలశక్తి అభియాన్‌లో నిజమాబాద్‌కు 21వ స్థానం' - jalashakthi
నీటి సంరక్షణకు దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యల్లో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం పొందిందని... దీనికి కృషి చేసిన సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహనరావు అభినందించారు.
జలశక్తి అభియాన్‌లో భాగంగా రెండు రోజుల క్రితం ప్రారంభించిన జల్ సాథి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రామ్మోహనరావు పాల్గొని దేశంలోని 450 జిల్లాలలో ఈ జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో నిజామాబాద్‌ను ఎంపిక చేశారని వెల్లడించారు. జులై 1 నుంచి సెప్టెంబర్ వరకు నీరు అదనంగా ఉపయోగించే జిల్లాలు, నీటి సమస్య ఎక్కువగా ఉన్నా జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్, నిజామాబాద్, ముప్కాల్ మండలాల్లో ఆయా శాఖలు తీసుకున్న చర్యలవల్ల 7.67 మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన జల శక్తి అభియాన్ కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం సాధించిందనందుకు హర్షం వ్యక్తం చేశారు.