Road Accident In Nizamabad today: ఆ తల్లి తన కుమారుడు, కుమార్తె కుటుంబాలతో కలిసి పిల్లల కుటుంబాలతో కలిసి దైవ దర్శనానికి వస్తానని మొక్కిన మొక్కు చెల్లించాలనుకుంది. తల్లి కోరిక మేరకు ఆ కుటుంబమంతా కలిసి ఎంతో సంతోషంగా దైవ దర్శనానికి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో కలిసి కుటుంబమంతా దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రశాంతంగా దైవ దర్శనం జరిగిందన్న ఆనందంలో.. ఎంతో ఉత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మరి కాసేపట్లో ఇళ్లు చేరతారనే తరుణంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చింది. ఓ తల్లిని తన పిల్లలకు దూరం చేసింది. అసలేం జరిగిందంటే..?
JCB fell on to the car in Nizamabad: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో కలిసి బడా భీమ్గల్ ఎల్లమ్మ ఆలయానికి మొక్కు చెల్లించడానికి వెళ్లారు. మొక్కు చెల్లించి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. భీంగల్లోని విద్యుత్ ఉపకేంద్రం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ ట్రాలీపై తీసుకెళ్తున్న పొక్లెయిన్ ప్రమాదవశాత్తు లక్ష్మీ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.