నిజామాబాద్ జిల్లా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లిలో వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. పదిన్నర గంటలకు ఇంటి నుంచి అంతిమయాత్ర బయల్దేరగా... మధ్యాహ్నం 12 గంటలకు పూర్తైంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అర్వింద్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ... మహేశ్ పాడె మోశారు.
అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు - జవాన్ మహేశ్ అంత్యక్రియల వార్తలు
దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన వీర సైనికుడు మహేశ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, భారీగా తరలొచ్చిన ప్రజలు అమర జవాన్‌కు నివాళులు అర్పించారు.
![అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు Javan mahesh funeral ceremony in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9509591-thumbnail-3x2-funal.jpg)
అశ్రునయనాల మధ్య మహేశ్‌కు కన్నీటి వీడ్కోలు
సైనిక వందన అనంతరం మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మహేశ్ చితికి తండ్రి గంగమల్లు నిప్పంటించగా... సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరి గడియాల్లో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. అశేషంగా తరలి వచ్చిన ప్రజలు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.
అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు