దిశ ఘటనను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమెన్స్ కళాశాల నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసనను వ్యక్తం చేశారు. దిశ ఘటన జరిగి వారం రోజులు వారం గడుస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విద్యార్థులు మండిపడ్డారు. చట్టాలను సవరించి నూతన చట్టాలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు.
'వారం రోజులవుతుంది.. దిశకు న్యాయం చేయండి' - దిశకు న్యాయం చేయాలని ర్యాలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి జస్టిస్ దిశ అంటూ ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
!['వారం రోజులవుతుంది.. దిశకు న్యాయం చేయండి' jastice-for-disha-raly-in-nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267517-795-5267517-1575469058645.jpg)
వారం రోజులవుతుంది.. దిశకు న్యాయం చేయండి