నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్, వీ పాటిల్‌తో కలిసి కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతాల్లో ఇవాళ బైక్‌పై లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. లాక్డౌన్ పటిష్టంగా అమలు వలన మనకు వచ్చే వారం నుంచి తక్కువ కేసులు ఉండొచ్చన్నారు. మొదటి పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారికి 14 రోజుల తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించి నెగిటివ్ వస్తే ఫ్రీ ఫ్రమ్ వైరస్ అని ధ్రువీకరణ చేస్తామన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం
ఈ వారం రోజులు లాక్డౌన్ పాటించడం చాలా ముఖ్యమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో కలిసి బైక్‌పై పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధమని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం
కంటైన్మెంట్ ప్రాంతాల్లో వారికి డోర్ డెలివరీ ద్వారా నిత్యావసరాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొగాకు, పొగాకేతర వస్తువులు నమలడం, గుట్కా తినడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధమని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే కఠిన చర్యలతోపాటు జరిమానా విధించడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి :'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'