ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించడం, హైదరాబాద్‌పై భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో... వివిధ జిల్లాలకు ప్రభుత్వం ఐటీ హబ్‌లు మంజూరు చేసింది. ఐటీ కేంద్రాలుగా తీర్చిదిద్దడం సహా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్‌లో సేవలు మెుదలయ్యాయి. ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2017లో నిజామాబాద్‌లోనూ ఐటీ హబ్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. 2018 ఆగస్టులో గిర్‌రాజ్ కళాశాల సమీపంలో... నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.20 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కోరోనా కారణంగా..
ఐటీ హబ్ నిర్మాణ పనులు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనా.... కరోనా కారణంగా కొద్ది రోజులపాటు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనుల్లో వేగం పుంజుకుంది. సివిల్ పనులు పూర్తవ్వగా... ప్రహరి, ఎలివేషన్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, పార్టిషన్ పనులు చేపట్టాల్సి ఉంది. దాదాపు 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్.... మరో 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నారు. మెుదట కేటాయించిన రూ.25 కోట్లతోపాటు అదనంగా మరో రూ.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఐటీ టవర్ కోసం రూ.33 కోట్లు వెచ్చిస్తున్నారు.