నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ తర్వాత ప్రతిరోజూ... 15కు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 200కు చేరువయ్యాయి. యాక్టివ్ కేసులు 48 ఉండగా.. పది మంది కరోనాతో చనిపోయారు.
ఇందూరులో కరోనా కట్టడికి అధికారులు ఏం చేస్తున్నారంటే? - corona cases in nizambad
ఇందూరు జిల్లాలో రోజురోజుకి కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న కలెక్టర్ నారాయణరెడ్డితో మా ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇందూరుపై కరోనా పడగ... అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసి.. కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోందని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోన్న కలెక్టర్ నారాయణరెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్