నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకపోడ్ సంఘ సభ్యులు కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఆగస్టు 9ని సెలవు దినంగా ప్రకటించి... ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేపూర్ సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సందన్న, గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు మీనుగు రవి, ఆదివాసీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
'ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి' - చేపూర్లో ఆదివాసీ దినోత్సవం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమురం భీం చిత్రపటానికి నివాళులు అర్పించి, జెండా ఎగురవేశారు.
'ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి'