నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్చి 31 (బుధవారం)లోపు పాత బకాయి పన్నుపై వడ్డీలో 90% మాఫీ చేస్తామని... కేవలం 10 శాతం వడ్డీతో పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జితేష్ మంగళవారం ప్రకటించారు.
'90% వడ్డీ మాఫీ చేస్తా... 10%తో బకాయిలు చెల్లించండి' - తెలంగాణ వార్తలు
వడ్డీలో 90% మాఫీ చేస్తామని... కేవలం 10 శాతం వడ్డితో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని అధికారులు సూచించారు. కానీ ఒక్కరోజు గడువు సరిపోదంటూ... ఈ నిర్ణీత సమయాన్ని పెంచాలని పట్టణవాసులు కోరుతున్నారు.
'90% వడ్డీ మాఫీ చేస్తా... 10%తో బకాయిలు చెల్లించండి'
ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను బకాయిల రాయితీకి చివరి రోజు కావడంతో పన్నులు చెల్లించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. కానీ సర్వర్ లోపంతో మిషన్లు చాలా సేపు మొరాయించాయి. అధికారులు ఈ గడువును పెంచాలని పట్టణ వాసులు కోరుతున్నారు.