అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వివేకానంద కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనంను పోలీసులు ఛేదించారు. సోలాపూర్‌కు చెందిన నందకుమార్ స్థానిక చంద్రనగర్‌లో కిరాయికి ఉంటూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. - Nizamabad district police have arrested an inter-state burglary gang
వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందుతున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నేరస్తుడి నుంచి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక చరవాణీ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి : ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?