తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జెండా ఆవిష్కరణ - కలెక్టరేట్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జెండా ఆవిష్కరణ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్​, బిగాల గణేష్​గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి అన్నారు.

independence day celebrations at nizamabad
కలెక్టరేట్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జెండా ఆవిష్కరణ

By

Published : Aug 15, 2020, 12:14 PM IST

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ విఠల్​రావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్​, బిగాల గణేష్​గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్​రెడ్డి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​ నాయకత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని.. ఆసరా, కల్యాణలక్ష్మి, పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్​మెంట్, రైతు బంధు, రైతు బీమా.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరందించే లక్ష్యం పూర్తవుతోందన్నారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details