నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ దేశానికే దిక్సూచి వంటి వారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘ ప్రతినిధులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేడ్కర్ దేశానికే దిక్సూచి: ధర్మపురి అర్వింద్ - Dharmapuri Aravind
నిజామాబాద్ జిల్లా గౌరారంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవిష్కరించారు. ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
అంబేడ్కర్ దేశానికే దిక్సూచి: ధర్మపురి అర్వింద్