నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సరిపడా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 227 శౌచాలయాలు కొత్తగా నిర్మిస్తున్నారు. వీటిలో 153 పూర్తి కాగా.. మిగిలినవి ఆగస్టు 15 వరకు పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు.
పూర్తి కానుండగా
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో 14 మరుగుదొడ్లు పూర్తి కావొస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీలో 42 పూర్తి కానుండగా.. మరో 6 నిర్మించడానికి పనులు ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 50శాతం షీ-టాయిలెట్లు నిర్మించి.. సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.