నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు చేయగా... అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 95 వేలు రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - నిజామాబాద్లో అక్రమ మద్యం తరలింపు
లాక్డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. అలాగే 95 వేల రూపాయల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్లోనూ అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
మద్యాన్ని నిజామాబాద్ నుంచి మల్కాపూర్ తరలించే ప్రయత్నం చేసినట్లు వివరించారు. సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల సరుకును పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు