దేశానికే అన్నం పెట్టే రైతులను దేశ ద్రోహులుగా పేర్కొంటూ.. వారిపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఐఎఫ్టీయు నిజామాబాద్ అధ్యక్షుడు ఎల్.బి.రవి అన్నారు. రైతు ఉద్యమాన్ని చీల్చే కుట్రలో భాగంగానే ఎర్రకోట ఘటన జరిగిందన్న ఆయన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని గాంధీ చౌక్ వద్ద శాంతియుత దీక్ష చేశారు.
'అన్నం పెట్టే రైతును దేశద్రోహిగా పేర్కొనడం సిగ్గుచేటు' - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాని ఐఎఫ్టీయు నిజామాబాద్ అధ్యక్షుడు ఎల్.బి.రవి అన్నారు. వాటి స్థానంలో రైతు పండిస్తున్న ప్రతి పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించే చట్టాన్ని చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని గాంధీ చౌక్ వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు.
'అన్నం పెట్టే రైతును దేశద్రోహిగా పేర్కొనడం సిగ్గుచేటు'
సైన్యంలో మెజార్టీ భాగం పంజాబ్ రైతు కుటుంబాల నుంచి వెళ్లిన వారేనన్న రవి అలాంటి వారి కుటుంబ సభ్యులను దేశద్రోహులుగా పేర్కొనడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసి.. రైతు పండిస్తున్న ప్రతి పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు బుమన్న, జెల్లా మురళి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'శాంతియుత ఉద్యమం చేయకుంటే అది మోదీ విజయమే'