తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి' - దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ

కొవిడ్ సంక్షోభంలో.. బాధితులతో పాటు ప్రజలందరిని ప్రభుత్వాలే  అన్ని విధాల ఆదుకోవాలని ఐఎఫ్​టీయూ నిజామాబాద్ నగర అధ్యక్షులు రవి కోరారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి.. ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోన్న దృష్ట్యా.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరముందన్నారు.

health emergency
health emergency

By

Published : May 17, 2021, 3:43 PM IST

కొవిడ్ రెండో దశ నేపథ్యంలో.. దేశంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరముందని ఐఎఫ్​టీయూ నిజామాబాద్ నగర అధ్యక్షులు రవి పేర్కొన్నారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపత్కాలంలో బాధితులతో పాటు.. ప్రజలందరిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర మందుల కొరతతో.. బాధితులు వాటిని బ్లాక్​లో రూ. లక్షలు పెట్టి కొంటున్నారని రవి పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్ని అన్ని రకాల సౌకర్యాలు, సిబ్బందితో బలోపేతం చేయాలన్నారు. మందులు, ప్రాణ వాయువును యుద్ద ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలన్నారు.

కష్ట కాలంలో పేద కుటుంబాలకు నెలకు.. 50 కేజీల బియ్యం, రూ. 7 వేలను ఆర్థిక సాయంగా ప్రకటించాలని రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్​టీయూ రాష్ట్ర నాయకులు భూమన్న, నగర నాయకులు మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ABOUT THE AUTHOR

...view details