నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కూరగాయల గంజ్‌లో కార్మికుల చేత ఐఎఫ్టీయూ సార్వత్రిక సమ్మె పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ నెల 26న దేశ వ్యాప్తంగా నిర్వహించబోతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నగర కార్యదర్శి ఎం. శివకుమార్ కోరారు. భాజపా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కార్మిక చట్టాలు మారుస్తూ, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు.
'దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి' - ఐఎఫ్టీయూ సార్వత్రిక సమ్మె వార్తలు నిజామాబాద్
ఈ నెల 26న దేశ వ్యాప్తంగా నిర్వహించబోతున్నఐఎఫ్టీయూ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నిజామాబాద్ కార్యదర్శి శివకుమార్ కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నగరంలోని వ్యవసాయ మార్కెట్ కూరగాయల గంజ్‌లో కార్మికుల చేత ఆవిష్కరించారు.
'దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందని.. దీంతో ఉన్న ఉపాధి పొయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్, గంగాధర్, రాజు సాయిలు, రాజకుమార్, శేఖర్, లక్ష్మణ్, మల్లేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'దుబ్బాకతోనే తెరాస పతనం.. గ్రేటర్‌లోనూ అదే పునరావృతం'