తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒప్పంద, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి' - తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల 11న జరగనుంది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూనియన్ కోరింది. ఒప్పంద, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

iftu meeting, nizamabad district news
ఐఎఫ్‌టీయూ సమావేశం, నిజామాబాద్ జిల్లా వార్తలు

By

Published : Apr 6, 2021, 8:10 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. రాష్ట్ర యూనియన్ ప్రథమ మహాసభ ఈనెల 11న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నట్లు తెలిపారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఒప్పంద, అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేసి, 30శాతం వేతన పెంపు వర్తింపజేయాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వారికీ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేశ్వర్, శాంతికుమార్, తిరుపతి, చరణ్, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:లంచం డబ్బు తగలబెట్టిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details