నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
'జీహెచ్ఎంసీ మాదిరిగా వేతనాలు చెల్లించాలి' - ఐఎఫ్టీయూ ధర్నా వార్తలు
ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చినట్లుగా తమకూ అంతే స్థాయిలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐఎఫ్టీయూ, నిజామాబాద్ నగరపాలక సంస్థ
నిజామాబాద్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు జీహెచ్ఎంసీలో మాదిరిగా వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమల కృష్ణ డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన