తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్ ఎంపీగా గెలిచేది నేనే: ధర్మపురి అరవింద్ - bike ryally

బోధన్​లో భారతీయ జనతా పార్టీ  కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ముఖ్య కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్  పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది : ధర్మపురి అరవింద్

By

Published : Mar 27, 2019, 8:52 PM IST

తెరాస ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు : ధర్మపురి అరవింద్
నిజామాబాద్ జిల్లా బోధన్​లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సమావేశానికి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. నర్సాపూర్ చౌరస్తా నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించటంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. పసుపు రైతులకు,ఎర్ర జొన్న రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, లోక్​సభ ఎన్నికల్లో భాజపా గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details