తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు, ఎర్రజొన్న రైతులతో మంత్రి వేముల​ సమావేశం

పసుపు, ఎర్రజొన్న గిట్టుబాటు సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వరుస నామినేషన్లతో గాబరా పడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. రైతులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కరిస్తామని తొందరపడ్డొద్దని విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 23, 2019, 9:47 PM IST

రైతుల నిరసనపై స్పందించిన సర్కారు

రైతుల నిరసనపై స్పందించిన సర్కారు
నిజామాబాద్ లోక్​ సభ స్థానానికి పెరుగుతున్న నామినేషన్ల పర్వంతో స్పందించిన ప్రభుత్వం భవనాలు, గృహనిర్మాణ, రవాణా శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డిని రంగంలోకి దించింది. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో ఎర్రజొన్న, పసుపు రైతులతో భేటీ అయ్యారు.


ఎర్రజొన్నలతో పాటు, పసుపునకు మద్దతు ధర చెల్లించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని రైతులు కోరారు. పెట్టిన పెట్టుబడి రాక తాము నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి హామీ

రైతు సమస్యల పరిష్కారం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆందోళన చేయొద్దని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో మాజీ శాసన సభాపతి కేఆర్‌ సురేష్‌రెడ్డి, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మోదీపై పోటీకి 111మంది అన్నదాతలు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details