రేషన్ దుకాణాల్లో మొరాయిస్తున్న సర్వర్లతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు చక్కర్లు కొడుతూ ఇబ్బందులు పడుతున్నారు.
భారీ లైన్లు...బియ్యం ఇవ్వడం లేదు! - మొరాయిస్తున్న సర్వర్లు
ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యానికి బయోమెట్రిక్ కొనసాగించటం వల్ల అవి పలు చోట్లు మోరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు భారీ లైన్లు కట్టి సాయంత్రం దాకా వేచి చూస్తున్నారు. అయినా సర్వర్లు పనిచేయక బియ్యం ఇవ్వకపోవడం వల్ల వెళ్లి పోతున్నారు.
భారీ లైన్లు...బియ్యం ఇవ్వడం లేదు!
నగరంలోని పలు రేషన్ షాపుల్లో బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యానికి బయోమెట్రిక్ కొనసాగించడం పట్ల లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడ్డా బియ్యం తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు'