నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు కార్యాలయం పెట్టినంత మాత్రాన పసుపు రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశంలో 16 చోట్ల ఈ స్పైస్ బోర్డు కార్యాలయాలు ఉన్నాయని.. అక్కడా రైతులకు మద్దతు ధర రావడంలేదని మంత్రి గుర్తు చేశారు.
వరంగల్‌లో దాదాపు 20 సంవత్సరాలుగా, సికింద్రాబాద్‌లో 30 సంవత్సరాలుగా స్పైస్ బోర్డు కార్యాలయాలున్నా.. పసుపు రైతుకు మద్దతు ధర రూ.15 వేలు ఎందుకు దక్కడం లేదన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానంత వరకు రైతుకు మేలు జరగదని ఈ కార్యాలయాల చరిత్ర చెబుతోందన్నారు.