తెలంగాణ

telangana

ETV Bharat / state

పెండింగ్​ స్టైఫండ్ ఇవ్వాలని హౌస్ సర్జన్ల ధర్నా - house surgeons protest in nizamabad

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట హౌస్ సర్జన్లు ఆందోళన చేపట్టారు. ఆరు నెలలుగా పెండింగ్​లో ఉన్న స్టైఫండ్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

house surgeons protest in nizamabad government hospital for stipend
స్టైఫండ్ ఇవ్వాలని హౌస్ సర్జన్ల ధర్నా

By

Published : Feb 2, 2021, 12:27 PM IST

ఉపకార వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట హౌస్ సర్జన్లు ఆందోళనకు దిగారు. వంద మంది హౌస్ సర్జన్లు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. న్యాయం చేయాలని నినదించారు. ఆరు నెలలుగా ఆస్పత్రిలో హౌస్ సర్జన్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉపకార వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు.

నెలకు 19వేల580 చొప్పున ఆరు నెలలుగా బకాయిలు ఉన్నాయని గోడు వెల్లబోసుకున్నారు. మార్చిలో హౌస్ సర్జన్లుగా విధులు పూర్తవుతాయని.. 4 నెలలు మాత్రమే ఉపకార వేతనం ఇచ్చి.. ఆరు నెలలు చెల్లించడం లేదన్నారు. కొవిడ్‌లోనూ విధులకు హాజరై.. 20మంది వరకు కరోనా బారిన పడ్డామన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని హౌస్‌ సర్జన్లు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :కుమార్తె భవిష్యత్ కోసం తల్లి ఆమరణ దీక్ష

ABOUT THE AUTHOR

...view details