నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో హోలీ ఘనంగా జరుపుకున్నారు. శనివారం అర్ధరాత్రి కామ దహనం చేసి, ఆదివారం నాడు హోలీ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
బాల్కొండలో ఘనంగా హోలీ సంబురాలు - బాల్కొండలో హోలీ సంబరాలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో చాలా గ్రామాల ప్రజలు ఈ రోజే హోలీ జరుపుకున్నారు. ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.

బాల్కొండలో ఘనంగా హోలీ సంబురాలు
విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దారిలో కనిపించిన వారందరికీ రంగులు చల్లారు. యువత రంగులే కాకుండా కోడిగుడ్లు, టమాటలు కూడా కొట్టుకుంటూ సంబురాల్లో మునిగి తేలారు.
బాల్కొండలో ఘనంగా హోలీ సంబురాలు
ఇవీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..