నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి అయోధ్య రామాలయానికి నిర్వహిస్తున్న సైకిల్ యాత్రకు వర్ని మండల కేంద్రంలో హిందూ బంధువులు ఘన స్వాగతం పలికారు. రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకలు, పాదుకలు తీసుకెళ్తున్నట్లు గురుస్వామి వినయ్ వెల్లడించారు. అయోధ్యకు 33 మంది యాత్ర చేపట్టారు.
సుఖశాంతులతో..
యాత్ర 1,400 కిలోమీటర్లు సాగుతుందని.. రోజుకు 60 కిలోమీటర్ల చొప్పున 23 రోజుల తర్వాత అయోధ్యకు చేరుకుంటామని వెల్లడించారు. 'సువర్ణ భూమి శ్రీరామరక్ష సైకిల్ యాత్ర' పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే చేస్తున్నట్లు పేర్కొన్నారు.