తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కోడెదూడకు రూ.1.20 లక్షలు.. - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లా సాటపూర్ పశువుల సంతలో కోడెదూడలకు డిమాండ్ ఏర్పడింది. బక్రీద్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు మార్కెట్‌కు తరలివచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఓ కోడెదూడకు రూ.1.20 లక్షల ధర పలకడం విశేషం.

highest cost for a calf, satapur market in nizamabad
కోడెదూడలకు భారీ డిమాండ్, కిక్కిరిసిన పశువుల సంత

By

Published : Jul 18, 2021, 3:59 PM IST

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటపూర్ పశువుల సంత శనివారం కిక్కిరిసింది. బక్రీదు నేపథ్యంలో కోడెదూడలకు డిమాండ్ పెరిగింది. సంతలో కనిష్ఠంగా రూ.20 వేలు... గరిష్ఠంగా రూ.1.20 లక్షల ధర పలికింది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఓ కోడెదూడ ఏకంగా రూ.1.20లక్షలు పలికింది. మార్కెట్‌లో ఉన్న అందరి చూపు ఆ కోడెదూడపై పడింది.

కోడెదూడకు రూ.1.20 లక్షలు

మూడేళ్లు పైబడిన కోడెదూడల కోసం వ్యాపారుల మధ్య పోటాపోటీగా విక్రయాలు జరిగాయి. సుమారు రూ.4కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు అంచనా. మూడు వేలకు పైగానే పశువులు క్రయ, విక్రయాలయ్యాయి.

కానరాని కరోనా నిబంధనలు

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పశువుల వ్యాపారులు సంతకు వచ్చారు. పశువుల కొనుగోళ్లలో పోటాపోటీగా ధరలు పెంచారు. మార్కెట్‌లో వ్యాపారం బాగా జరిగింది... కానీ ఎక్కడా కరోనా నిబంధనలు కానరాలేదు.

ఇదీ చదవండి:ఉమాకొప్పేశ్వరస్వామి ప్రత్యేకతలేంటి? ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details