తెలంగాణ

telangana

ETV Bharat / state

Social Boycotts : స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలా..? - Telangana HC on Social Boycotts

Telangana HC on Social Boycotts : 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలు కొనసాగుతుండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది సిగ్గుమాలిన పరిస్థితి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. నిజామాబాద్ జిల్లా ఎల్పూర్ మండలం రామన్నపేటలో సామాజిక బహిష్కరణ విధించడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌ విచారణ చేపట్టారు.

village boycott of mudiraj families in nizamabad
75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలా!

By

Published : May 6, 2023, 1:22 PM IST

Telangana HC on Social Boycotts: 75 ఏళ్ల స్వతంత్ర భారతం.. రోజుకో ఆవిష్కరణ.. మనుషులు కాళ్లు కింద పెట్టకుండా.. అసలు కదలకుండా అన్ని పనులు చేయగలిగే వీలుండేలా సాంకేతిక అభివృద్ధి.. ఇలా భారతదేశం నవనాగరికతను అలవర్చుకుని అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. అయినా నిత్యం ఏదో చోట ఇంకా మనల్ని వెనక్కు లాగుతున్న కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అదే సామాజిక బహిష్కరణ. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయంటే.. మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయంపై తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఆశ్చర్యంతో పాటు ఆవేదననూ వ్యక్తం చేసింది.

నిజామాబాద్ జిల్లా ఎల్పూర్ మండలం రామన్నపేటలో సామాజిక బహిష్కరణ విధించడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలు కొనసాగుతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహిష్కరణను నిలిపివేడయంతో పాటు అందుకు బాధ్యులైనవారి పై చర్యలు తీసుకుని కార్యాచరణ నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Social Boycotts in Nizamabad district :ఓ సామాజిక వర్గానికి చెందిన 300 కుటుంబాలను మార్చి 20న బహిష్కరిస్తూ.. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తీర్మానించిందంటూ పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వర్గం వ్యాపారం నిమిత్తం అద్దెకు తీసుకున్న దుకాణాలను ఖాళీ చేయించారని...ఇళ్లలో చేసుకునే శుభకార్యాలకూ హాజరుకాకుండా నిషేధం విధించారని తెలిపారు. తమతో మాట్లాడితే జరిమానా విధిస్తామంటూ బెదిరిపులకు పాల్పడుతున్నారని కోర్టుకు వివరించారు.

అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ న్యాయవాదులతో కమిషన్‌ వేసి వాస్తవాలు విచారించేలా అదేశాలివ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇప్పటికే జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నివేదిక సమర్పించారని... మళ్లీ మరో కమిషన్‌ అవసరంలేదని తెలిపారు. పిటిషనర్లపై సామాజిక బహిష్కరణ తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కలెక్టర్‌, ఎస్పీతో పాటు తదితరులను అదేశిస్తూ.. కోర్టు విచారణను జూన్‌ 10కి వాయిదా వేసింది.

75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా సామాజిక బహిష్కరణలు కొనసాగుతుండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది సిగ్గుమాలిన పరిస్థితి అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details