తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ఆదుకుంటాం' - help formers says minister vemula

నిజామాబాద్ జిల్లా నల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పంట నష్టపోయిన రైతులకు రైతుబీమా సహాయం అందేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్​ జిల్లా పర్యటనలో మంత్రి వేముల

By

Published : Nov 7, 2019, 8:14 PM IST


అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రైతుబీమా సహాయం అందేలా చూడాలని వ్యవసాయ అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా కల్పించారు. నల్లూరులో నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్​రావు, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్​ జిల్లా పర్యటనలో మంత్రి వేముల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details