నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. నీటి ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 1,091 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది.
శ్రీరాంసాగర్‌కు జలకళ... కొనసాగుతున్న వరద - ఎస్సారెస్పీ లేటెస్ట్ అప్డేట్స్
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. భారీ వర్షాలతో ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
![శ్రీరాంసాగర్‌కు జలకళ... కొనసాగుతున్న వరద heavy water flow to sriram sagar project in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9157658-709-9157658-1602573613457.jpg)
శ్రీరాంసాగర్‌కు జలకళ... కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్‌కు జలకళ... కొనసాగుతున్న వరద
ప్రాజెక్టులో 90 టీఎంసీల గరిష్ట నీటి సామర్థ్యం ఉంది. 86,443 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతోంది. వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు , 16 ప్రధాన గేట్ల ద్వారా 75,000 క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:సేద్య చట్టం... కార్పొరేట్ చుట్టం!.. వ్యవసాయ చట్టాలపై హరీశ్‌రావు మనోగతం
Last Updated : Oct 13, 2020, 2:34 PM IST