ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల జోరువాన కురిసింది. నగరంలో గంటపాటు జోరు వాన పడింది. ఉదయం నుంచి మబ్బులు పట్టిన చల్లని వాతావరణం ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం అందుకుంది. జోరు వానతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోధన్, నందిపేట్, రెంజల్, ఎడపల్లి, బాల్కొండ, జక్రాన్ పల్లి, ఆర్మూర్, మోర్తాడ్, డిచ్ పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో జోరు వాన కురిసింది. నవీపేట్, ఎడపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు
నెల రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఆశలు ఫలించేలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోనూ పలు చోట్ల వర్షం కురిసింది.
ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు