నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లో నిన్న కుండపోతగా వర్షం కురిసింది. మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. బాల్కొండ ప్రాంతంలో 4.8 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పంటలు కోసి రోడ్లపై, కళ్లాల్లో నూర్పిళ్లు చేసిన మొక్కజొన్నలు, సోయాబీన్ గింజలు వర్షానికి తడిసిపోయాయి. వాన నీటి ప్రవాహంలో గింజలు కొట్టుకుపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం పడుతుందని... కోసి ఆరబెట్టిన పంటలకు నష్టం కల్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతల్ని ముంచిన అకాల వర్షాలు - Heavy Rains in Nizamabad district crops looses farmers
సరైన సమయంలో వర్షం పడక అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే... ఇప్పుడు పంట చేతికొచ్చిన సమయంలో వానలు వదలడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నదాతల్ని ముంచిన అకాల వర్షాలు