నిజామాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఈ వర్షంతో రైతుల ముఖాల్లో ఆనందం విరిసింది. సుమారు గంటపాటు కురిసిన జోరువానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రయాణీకులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నగరంతో పాటు పలు మండలాల్లో జల్లులు పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
నిజామాబాద్లో భారీ వర్షం... రైతుల్లో హర్షం - HEAVY RAIN IN NIZAMABAD DISTRICT
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు జల్లులు కురిశాయి. నగరంలో రోడ్లు జలమయం కాగా... పల్లెల్లో రైతుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి.
HEAVY RAIN IN NIZAMABAD DISTRICT