తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - నిజామాబాద్​ నగరంలో భారీ వర్షం

నిజామాబాద్​ నగరంలో ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. గాలితో కూడిన వర్షం వల్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

heavy rain in nizamabad city
నిజామాబాద్​ నగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Jun 27, 2020, 10:49 PM IST

జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సమయంలో వర్షాలు కురిశాయి. అయితే గత వారం రోజుల నుంచి నిజామాబాద్​ నగరంలో పొడి వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.

నిజామాబాద్​లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలితో కూడిన వర్షం వల్ల నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీ వర్షం.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details