నాలుగేళ్లుగా నీళ్లు లేక ఎడారిగా మారిన మంజీరా నది జలకళను సంతరించుకుంది. ఎగువన కురిసిన వర్షాలకు నిజాం సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్ వరదతో.. మంజీరా నదికి జలకళ - manjeera river in nizamabad district
ఎగువన కురిసిన వర్షాలకు నిజాంసాగర్ జలాశయం పూర్తిగా నిండటం వల్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాలు చేరి మంజీరా నది జలకళను సంతరించుకుంది.
మంజీరా నదికి జలకళ
సాగర్ జలాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర వద్ద మంజీరా నది నిండుకుండలా ప్రవహిస్తోంది. పాత వంతెనను ఆనుకుని నీళ్లు ఉరకలేస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- ఇదీ చదవండి :వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ