కరోనా కొత్త రకం స్ట్రెయిన్ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల యూకే, ఇటలీ, ఇతర దేశాల నుంచి జిల్లాకు 26 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 8 నుంచి 22 మధ్య నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 26 మంది భారతీయులు రాగా... వారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.
కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు - Telangana news
కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గిందని అంతా భావిస్తోన్న సమయంలో బ్రిటన్లో మరో కొత్త రకం వైరస్ను గుర్తించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 26 మందిని అధికారులు గుర్తించారు.
కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు