రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు - ఆరోగ్య పరీక్షలు
లాక్డౌన్లో పోలీసులు, వైద్యులతో సమానంగా.. సేవలందించిన వారిలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యులు. వారి సేవలు వెల కట్టలేనివి. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వారి సేవలను కొనియాడారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది.
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు
ఆరోగ్య పరీక్షా కేంద్రాలను నగర మేయర్ నీతూ కిరణ్ సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ జితేష్ వి.పాటిల్, ఎంహెచ్ఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం