తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 3:28 PM IST

ETV Bharat / state

'రహదారులపై పంటనూర్పిళ్లు చేస్తే కఠిన చర్యలు'

నిజామాబాద్​ జిల్లాలోని రహదారులపై పంటల నూర్పిళ్లు చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అవగాహన కల్పిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు.

'రహదారులపై పంటనూర్పిళ్లు చేస్తే కఠిన చర్యలు'

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని జాతీయ రహదారితో పాటు గ్రామీణ రహదారులపై పంటలు నూర్పిళ్లు చేయొద్దని అవగాహన కల్పిస్తూ బాల్కొండ పోలీసులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీహరి, ఎన్​హెచ్​ఐ నిర్మల్​ బీవోటీ ప్రాజెక్టు మేనేజర్​ వెంకటరమణ కలిసి బ్యానర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

రహదారిపై మొక్కజొన్నలు, సోయలు, వరి ధాన్యం తదితర పంటలను ఎండ బెట్టడం వల్ల వాహనాలపై వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్సై శ్రీహరి పేర్కొన్నారు.

జిల్లాలో ఇటీవల కాలంలో రహదారిపై ఆరబెట్టిన పంటల వల్ల పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. రహదారులపై పంటలను ఆరబెడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్సై స్పష్టం చేశారు.

'రహదారులపై పంటనూర్పిళ్లు చేస్తే కఠిన చర్యలు'

ఇదీ చూడండి : "కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దు"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details