హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని హనుమాన్ మందిరాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంజన్నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వచ్చే ఏడాదైనా హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు భక్తులు.
నిరాడంబంరంగా హనుమాన్ జయంతి వేడుకలు - తెలంగాణ వార్తలు
కరోనా దృష్ట్యా వివిధ ఆలయాల్లో నిరాడంబంరంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ఆలయాల్లో సాదాసీదాగా జరిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కరోనా అంతం కావాలని వేడుకున్నామని అర్చకులు తెలిపారు.
హనుమాన్ జయంతి, నిజామాబాద్ హనుమాన్ జయంతి
గతేడాది నుంచి హనుమాన్ వేడుకలు సాదాసీదాగా జరుపుకోవాల్సి వస్తోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా అంతం కావాలని అంజన్నను వేడుకున్నామని అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్టు