తెరాస, భాజపావి ప్రజావ్యతిరేక ప్రభుత్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మధుయాస్కీకి మద్దతుగా ఇందూరులో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ప్రాంతంలో రైతులు పండించే ఎర్రజొన్న, పసుపు, వరి తదితర పంటలకు మద్దతు ధరను కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి 15 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రైతుల గురించి పార్లమెంట్లో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పటికీ ఈ ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. మధుయాస్కీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆజాద్ కోరారు.
తెరాస, భాజపా... దొందు దొందే: ఆజాద్ - తెరాస, భాజపా... దొందు దొందే: ఆజాద్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుడుతున్న వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పార్టీల ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీకి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రచారంలో పాల్గొన్నారు.

నిజామాబాద్లో గులాం నబీ ఆజాద్ ఎన్నికల ప్రచారం