గోదావరి నదీ యాజమాన్య బోర్డు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. గెజిట్ అమల్లో భాగంగా బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ (GRMB chairman chandra shkehar iyer) నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూర్ జలశాయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల..... గరిష్ట వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర జలవనరుల శాఖ... గోదావరిలో రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఎంత మేర వినియోగిస్తున్నారనే అంశంతో పాటు ప్రాజెక్టుల పని తీరును తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. నేడు ఎస్ఆర్ఎస్పీతో పాటు చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్నారు.
కేంద్రం ఇటీవల ఖరారు చేసిన పరిధికి అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు(River management boards) స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. పర్యటన అనంతరం ప్రాజెక్టుల స్వాధీనం విషయమై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈనెల 17న జీఆర్‌ఎంబీ సమావేశం