నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే గిట్టుబాటు ధర పొందుతారని గణేష్ గుప్తా తెలిపారు. దళారులకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం అమ్మకూడదని సూచించారు. కార్యక్రమంలో మెప్రా పీడీ రాములు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితురులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రారంభించారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే