తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ ఛైర్మన్ - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. మద్దతు ధర కోసం ధాన్యాన్ని ఎండబెట్టి తాలు లేకుండా తీసుకురావాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలను హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్​కు విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

grain purchase centre at bhansuwada, pocharam bhaskar reddy latest news
బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

By

Published : Apr 7, 2021, 7:36 PM IST

రైతులకు అన్యాయం జరగకుండా పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం కొంటోందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 442 కొనుగోలు కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 338 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ధాన్యాన్ని ఎండబెట్టి, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కనీస మద్దతు ధర పొందేందుకు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలను హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్​కు విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్​కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, నాయకులు దొడ్ల వెంకట్ రామ్ రెడ్డి, ఎజాజ్ ఖాన్, నాగులగామ వెంకన్న గుప్తా, మార్కెట్ కమిటీ సెక్రటరీ మొహసీన్ సుల్తానా, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా ఎలా?

ABOUT THE AUTHOR

...view details