ఈ సంవత్సరం వరి సాగు చేసిన రైతులు గణనీయమైన దిగుబడిని సాధించారు. కరోనా ప్రభావంతో పంట కోతలు ఆలస్యమై సకాలంలో కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోయారు.
కోళ్ల ఫారాలే ధాన్యాగారాలు
ఈ ఏడాది వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. కరోనా వల్ల కోతలు ఆలస్యమవడం వల్ల రైస్ మిల్లులకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ధాన్యం రావడం వల్ల నిజామాబాద్ జిల్లాలో ధాన్యాన్ని కోళ్ల ఫారాల్లో నిల్వ చేస్తున్నారు.
కోళ్ల ఫారాలే ధాన్యాగారాలు
అనంతరం రైస్ మిల్లులకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో లారీలు రావడం వల్ల ఖాళీగా ఉన్న కోళ్ల ఫారాల్లో ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నారు యజమానులు. నిజామాబాద్ శివారులోని కాలూర్, ఖానాపూర్ గ్రామ సమీపంలోని కోళ్ల ఫారాల్లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.