నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత వారం రోజులుగా భారీ వరద వచ్చింది. ఈ ఉదయం నుంచి ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 30 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1087 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్ర వైపు భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతోన్న వరద ప్రవాహం - srsp water levels
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతోన్న వరద ప్రవాహం