నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జె.సి)లో పనిచేసే ఉపాధ్యాయుడు కరోనా కాటుకు బలయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
కరోనా కాటుకు ఉపాధ్యాయుడు బలి - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ మహమ్మారి సోకి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
![కరోనా కాటుకు ఉపాధ్యాయుడు బలి government teacher dead with corona, covid death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:36:45:1619917605-tg-nzb-14-01-corona-teacher-mruti-av-ts10109-01052021173632-0105f-1619870792-781.jpg)
కరోనాతో ఉపాధ్యాయుడు మృతి, కొవిడ్‌తో ఉపాధ్యాయుడు మృతి
ఆయనకి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.