సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం అర్ధరహితమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన హిందూ రాష్ట్ర జాగృతి సభలో ఆయన పాల్గొన్నారు. సీఏఏ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్యతిరేకిస్తామనడం సరైంది కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
సీఎం గారూ..సీఏఏ గురించి పూర్తిగా తెలుసుకోండి: రాజాసింగ్ - సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం
సీఏఏ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం సరైంది కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన హిందూ రాష్ట్ర జాగృతి సభకు ఆయన హారయ్యారు.
సీఎం గారూ..సీఏఏ గురించి పూర్తిగా తెలుసుకోండి: రాజాసింగ్
ముస్లింలకు నష్టం లేదని కేంద్రం చెబుతున్నా.. వినిపించుకోవడం లేదని ఆరోపించారు. దేశం బయట మైనార్టీలుగా ఉన్న హిందువులకు దేశ పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏ తెచ్చారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు ఇది వ్యతిరేకం కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్తలు కమలానంద భారతి, పిట్ల కృష్ణ మహారాజ్, హిందూ జనజాగృతి రాష్ట్ర కన్వినర్ చేతన్లు హాజరయ్యారు.