నిజామాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు పురపాలక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. ప్రతి పట్టణవాసి తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు.
'స్వచ్ఛ నిజామాబాద్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలి' - nizamabad corporation news
నిజామాబాద్‌ను స్వచ్ఛ నగరంలో మార్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని నిజామాబాద్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా కోరారు. కార్పొరేషన్లో 60 నూతన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.6.5 కోట్లతో కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ కలిసి ప్రారంభించారు. ఒకే వాహనంలో తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసే విధానం ఉన్న 60 వాహనాలను కార్పొరేషన్ పాలకవర్గం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ నిజామాబాద్‌లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ లత, నగర మేయర్ నీతూ కిరణ్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ పాల్గొన్నారు.