గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గొట్ రమేష్ గంగపుత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. కమిటీ నిర్ణయించే ధరకే చేపల విక్రయాలు చేయాలని తమపై పెత్తనం చలయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తల్వేద గ్రామంలో కిలో చేపలు కేవలం రూ.80 విక్రయిస్తున్నారని.. ఫలితంగా గిట్టిబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని సమితి ఆందోళన వ్యక్తం చేసింది. చేపల, చెరువులపై పూర్తి హక్కులున్న సంప్రదాయ మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సమితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.