నిజామాబాద్ నగరంలో గణేశుని నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. కరోనా కారణంగా నిరాడంబరంగానే ఈ ఏడాది వినాయకుని శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభం కాగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర ఘనంగా జరిగింది.
నిరాడంబరంగా వినాయక నిమజ్జనోత్సవం - Ganesha immersion festival at nizamabad started by mla ganesh Gupta
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఈ ఏడాది నిరాడంబరంగానే వినాయకుని శోభాయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించగా.. సాయంత్రం ఐదు గంటల లోపే వినాయకుని విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.
నిజామాబాద్లో నిరాడంబరంగానే వినాయకుని నిమజ్జనోత్సవం
శోభాయాత్రను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించగా.. సాయంత్రం ఐదు గంటల లోపే వినాయకుని విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నగరవ్యాప్తంగా ఈ ఏడాది.. ఎక్కువ శాతం ఐదు అడుగుల లోపున్న విగ్రహాలనే అధికంగా ప్రతిష్ఠించారు. ఐదు అడుగులకు మించి ఉన్న విగ్రహాలను నిర్మల్ జిల్లా బాసర వద్దనున్న గోదావరిలోనే నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి:-యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'